యువగళం పాాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ముస్లీం నాయకుడు డిమాండ్ చేసారు.
గన్నవరం : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ డిమాండ్ చేసారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్ పై విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నూరుద్దిన్ తెలిపారు. వెంటనే అతడిపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేయాలని రాష్ట్ర డిజిపిని కోరారు నూరుద్దిన్.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని నూరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ గత ఎన్నికల్లో దెబ్బతి.పి అధికారాన్ని కోల్పోయిన టిడిపి పార్టీ బలోపేతంకోసం యువగళం పాదయాత్ర చేస్తున్నాడని భావించామని... కానీ సీఎం జగన్ ను తిట్టడానికి పాదయాత్ర చేస్తున్నాడని ఇప్పుడు అర్థమవుతుందని అన్నారు. మహిళా మంత్రి రోజాతో పాటు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లపై కూడా లోకేష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని నూరుద్దిన్ ఆరోపించారు.
కేవలం లోకేష్ నే కాదు అయ్యన్న పాత్రుడు, యార్లగడ్డ వెంకట్రావుని కూడా అరెస్ట్ చేయాలని నూరుద్దిన్ డిమాండ్ చేసారు. గౌరవ ముఖ్యమంత్రిని సైకో అంటూ మాట్లాడుతున్న లోకేష్ ను కటకటాలవెనక్కి తోసేవరకు తగ్గబోమని సయ్యద్ నూరుద్దిన్ అన్నారు.
Read More చంద్రబాబు రాజకీయం మొత్తం చీకటి చరిత్ర.. ఇంక డొంక కదలాలి: మంత్రి అమర్నాథ్
అవినీతికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ పార్టీ... రూ.118 కోట్లు అవినీతి డబ్బులకు సమాధానం చెప్పలేని వ్యక్తి చంద్రబాబు అని నూరుద్దిన్ ఆరోపించారు. 2014 నుండి 2019 వరకు టిడిపి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందన్నారు. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని పేర్కొన్నారు.
టిడిపి చీఫ్ చంద్రబాబు ఆధ్వర్యంలోనే లోకేష్,అయ్యన్నపాత్రుడు, యార్లగడ్డ వెంకట్రావు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆ ముగ్గురుని వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర డీజీపీని కోరుతున్నామని సయ్యద్ నూరుద్దిన్ అన్నారు.
