Asianet News TeluguAsianet News Telugu

క్షమాపణ చెప్పిన పెద్దాయన

మహానాడులో మాట్లాడుతూ, ఏయుని దెయ్యాలకొంపగా వర్ణించినందుకు క్షమాపణ చెప్పుకున్నారు. పైగా ఏయు తనకు తల్లిలాంటిదని కూడా  చెప్పారులేండి. ఏయుని తాను దెయ్యాలకొంప అనటం తప్పే అని అంగీకరించారు.

Murty apologizes against comments on AU

మొత్తానికి పెద్దాయన ఎంవివిఎస్ మూర్తి క్షమాపణలు చెప్పుకున్నారు. సారి చెప్పుకోవటం ద్వారా తన పెద్దరికాన్ని కొంతైనా కాపాడుకున్నట్లైంది. మూడు రోజుల క్రితం ఎంఎల్సీ మూర్తి మాట్లాడుతూ, ఆంధ్రా యూనివర్సిటీ ఒక దయ్యాల కొంప అని వ్యాఖ్యానించారు. దాంతో ఏయూ క్యాంపస్ తో పాటు విశాఖపట్నంలోని వివిధ వర్గాలు మూర్తిపై మండిపడ్డాయి. ఎందుకంటే, మూర్తి స్వయంగా విశాఖపట్నం వాసి.

ఈ రోజు మహానాడులో  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గిర ఉండి మూర్తి చేత క్షమాపణలు చెప్పించారు.

సభలో ఒక తీర్మాణం ప్రవేశపెట్టి వేదిక దిగి వెళ్లిపోతున్న  మూర్తి వెనక్కుపిలిచి, ఆంధ్రా విశ్వవిద్యాలయం మీద చేసిన వ్యాఖ్యల గురించి గుర్తు చేసి క్షమాపణలు కోరాలని ఆదేశించారు.

‘ఉన్నత స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నాను,’అని ఆయన ప్రకటించారు.

ఆయన ప్రస్తానంలో ఏయు ఎంతో సహాయం చేసింది. మూర్తికి, ఏయుకి విడదీయరాని బంధం ఉంది. అటువంటి పెద్దాయన ఒక్కసారిగా ఏయుని దెయ్యాల కొంప అనటమేంటి? అసలు అంతమాట ఎందుకున్నారో ఎవరికీ అర్ధంకావటం లేదు. పైగా అదే దెయ్యాలకొంపలోనే ప్రస్తుతం మహానాడు జరుగుతోంది. మహానాడును ఏయు క్యాంపస్ లో జరపాలని చంద్రబాబునాయుడు నిర్ణయించిన తర్వాత మూర్తి దాన్ని దెయ్యాలకొంప అనటమేంటని అందరూ విస్తుపోయారు. కానీ పెద్దాయన కదా పార్టీలో ఎవ్వరూ జోక్యం చేసుకోలేదు.

కానీ ఏయు విద్యార్ధులు, సిబ్బంది, స్ధానికులకు మొహమాటాలు ఎందుకుంటాయి. అందుకనే ఆందోళన మొదలుపెట్టారు. మూడు రోజులుగా ఏయు క్యాంపస్ లో మూర్తికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికి ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్ళింది. ఒకవైపు ఏయు క్యాంపస్ లోనే కార్యక్రమం జరుపుకుంటూ మళ్ళీ అదే క్యాంపస్ ను తప్పుపడితే ఎలా? వెంటనే మూర్తితో ముఖ్యమంత్రి మాట్లాడారు. క్షమాపణ చెప్పమని ఆదేశించారు. దాంతో పెద్దాయన దిగివచ్చారు.

ఈరోజు మహానాడులో మాట్లాడుతూ, ఏయుని దెయ్యాలకొంపగా వర్ణించినందుకు క్షమాపణ చెప్పుకున్నారు. పైగా ఏయు తనకు తల్లిలాంటిదని కూడా  చెప్పారులేండి. ఏయుని తాను దెయ్యాలకొంప అనటం తప్పే అని అంగీకరించారు. దాంతో వివాదం ముగిసింది. ఎంతటివారైనా సరే ప్రజాగ్రహానికి తలొంచాల్సిందే అని మూర్తికి బాగా అర్ధమయ్యే ఉంటుంది లేండి.

Follow Us:
Download App:
  • android
  • ios