బెజవాడలో దారుణం: మాట్లాడాలని పిలిచి.. బావను హత్య చేసిన బావమరిది

murder in vijayawada
Highlights

విజయవాడలో పట్టపగలు, నడిరోడ్డు మీద దారుణహత్య జరిగింది. చదలవాడ రాజు అనే వ్యక్తిని అతని సమీప బంధువు దారుణంగా నరికి చంపాడు

విజయవాడలో పట్టపగలు, నడిరోడ్డు మీద దారుణహత్య జరిగింది. చదలవాడ రాజు అనే వ్యక్తిని అతని సమీప బంధువు దారుణంగా నరికి చంపాడు. రాజు, శేఖర్ అనే వ్యక్తులు బావబావమరిదిలు.. వీరి కుటుంబాల మధ్య కొద్దిరోజులుగా కుటుంబకలహాలు ఉన్నాయి. ఈ క్రమంలో కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి రాజుని రమ్మని పిలిపించి.. దారుణంగా హత్య చేశాడు శేఖర్. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి పరారీలో ఉన్న శేఖర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలు నడిరోడ్డు మీద దారుణ హత్య జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 
 

loader