విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమళ్ళపూడిలో దారుణం చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన అధికార వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణపై కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. 

రక్తపుమడుగులో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సత్యనారాయణను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అతడికి చికిత్స చేస్తున్నారు. అయితే అతడి పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.