కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఫ్యాక్షన్ భగ్గుమంది. వీరపనాయునిపల్లి మండలం పాయసంపల్లి వైసీపీలో వర్గపోరు కారణంగా వైసీపీ నేత నిమ్మకాయల సుధాకర్ రెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది.

కత్తులు, రాళ్లతో దాడి చేశారు మహేందర్ రెడ్డి, అనుచరులు. దీంతో సుధాకర్ రెడ్డి ప్రత్యర్ధులపై కాల్పులు జరిపాడు. ఈ ఘర్షణ నేపథ్యంలో పాయసంపల్లెలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. కొత్త సంవత్సర వేడుకల సమయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.