విశాఖపట్నంలో పూజారిపై హత్యాయత్నం  చోటుచేసుకుంది. ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇసుకతోట శివాలంయం పూజారిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

విశాఖపట్నంలో పూజారిపై హత్యాయత్నం చోటుచేసుకుంది. ఎంవీపీ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇసుకతోట శివాలంయం పూజారిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పూజారికి గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. పూజారి ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆలయ నిర్వాహణలో ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబందించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.