నెల్లూరులో వివాహిత అనుమానాస్పద మృతి....కండోమ్, వీర్యం ఆధారంగా విచారణ

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 25, Aug 2018, 3:48 PM IST
Married Woman Suspicious death In Nellore
Highlights

కూలీ పనికోసం వెళ్లిన ఓ వివాహిత అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే మహిళ మృతదేహం దగ్గర పడివున్న కండోమ్ పాకెట్లు ఈ మృతిపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వివాహితపై అత్యాచారం చేసి హత్య చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
 
ఈ మహిళ మృతిపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా కు చెందిన రాజు-రాజేశ్వరి దంపతులు. రాజు కొత్తకాలువ సెంటర్లో ఓ రైసు మిల్లులో పనిచేస్తుండగా, అతడి భార్య రాజేశ్వరి నెల్లూరు పట్టణంలో కూలీ పనులకు వెళ్లేది. రోజూ మాదిరిగానే గురువారం కూలీ పనులకు వెళ్లిన ఈమె నగర శివారులోని అల్లీపురం తోటల్లో శవమై తేలింది. 

రాజేశ్వరి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు. మృతదేహం పక్కనే పడివున్న కండోమ్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కండోమ్ వాడేసి పడేశారని, వీటిలోని వీర్యం ఆధారంగా నిందితులను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అంతే కాకుండా మృతురాలి కాల్ డేటా ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

త్వరలోనే ఈ కేసును చేదిస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు.

loader