Asianet News Telugu

సినీటుడు, ఎంపీ మురళీమోహన్ కు మాతృవియోగం

వసుమతిదేవి వయస్సు ప్రస్తుతం 100 సంవత్సరాలు. ఇకపోతే మురళీమోహన్ తల్లి వసుమతీదేవి అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జేఎన్ రోడ్ లో నిర్వహించనున్నారు. మాతృవియోగంతో బాధపడుతున్న మురళీమోహన్ ను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించారు. 
 
Murali Mohan's mother passed away
Author
Rajamahendravaram, First Published Apr 18, 2019, 2:33 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్: ప్రముఖ నటుడు, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ తల్లి  శ్రీమతి మాగంటి వసుమతిదేవి కన్నుమూశారు. గురువారం ఉదయం ఆమె తమ స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 

వసుమతిదేవి వయస్సు ప్రస్తుతం 100 సంవత్సరాలు. ఇకపోతే మురళీమోహన్ తల్లి వసుమతీదేవి అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జేఎన్ రోడ్ లో నిర్వహించనున్నారు. మాతృవియోగంతో బాధపడుతున్న మురళీమోహన్ ను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించారు. 

ఇటీవలే మురళీమోహన్ తన తల్లి మాగంటి వసుమతీదేవి శతవసంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా గుడివాడలోని గౌరీసంకరపురం గ్రామంలో వేడుకలు నిర్వహించారు. వందో పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కేక్ కట్ చేయించారు మురళీమోహన్. ఈ వేడుకలకు సుమారు 100 మందికిపైగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios