Mudragada: కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. కాపు ఉద్యమ సమయంలో అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేసినందుకు ముద్రగడ పద్మనాభం హర్షం వ్యక్తం చేశారు. 

Mudragada: : కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. కాపు ఉద్యమ సమయంలో అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేసినందుకు ముద్రగడ పద్మనాభం హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నాడు ముద్రగడ.. ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.

 కేసులు ఉపసంహరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. చెయ్యని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ పెట్టిన కేసులు అన్యాయం అని పేర్కొన్నారు. స్వయంగా వచ్చి తాను ధన్యవాదాలు తెలపాలని ఉన్నా కలవలేని పరిస్థితి ఉందన్నారు. ఒకవేళ తాను మిమ్మల్ని కలిసినా కాపు జాతిని తాకట్టు పెట్టి పదవుల కోసం వెళ్లి కలిశారని కొందరు విమర్శలు చేస్తారన్నారు. 

అన్యాయంగా పెట్టిన కేసులు పెట్టి.. మాకు మోక్షం కలిగించారని అన్నారు. గతంలో చంద్రబాబు కాపులను బీసీ ఎఫ్ లో చేర్చినప్పుడు స్వయంగా వెళ్లి ధన్యవాదాలు తెలపాలనుకున్నా చేయలేెకపోయాయని చెప్పారు. చంద్రబాబు, జగన్ లను స్వయంగా కలుసుకునే పరిస్థితిలో తాను లేనని ఆయన ఆవేదనతో జగన్ కు లేఖ రాశారు.

‘‘మా జాతి ఉద్యమం నుంచి న‌న్ను తప్పించినా, ఆ కేసులకు మోక్షం కలిగించారు. కాపులను బీసీ – ఎఫ్ లో చేర్చి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపినప్పుడు కూడా అప్పటి సీఎం చంద్రబాబుని కలిసి ధన్యవాదాలు తెలపాలనుకున్నా. అలా చేస్తే జాతిని పదవుల కోసం.. డబ్బులు కోసం అమ్మేసుకున్నాను అని అంటారని భయపడ్డా. అందుకే మిమ్మల్నీ కలవలేకున్నాను. చాలా మంది పెద్దలు రకరకాల సమస్యలతో మీ ఇరువురి వద్దకు వచ్చినా తప్పు పట్టారు. నేను ఎప్పుడో చేసుకున్న పాపం అనుకుంటాను’’ అంటూ ముద్రగడ కృతజ్ఞతలు చెబుతూనే ఆవేదన వ్యక్తం చేశారు.