కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు వైసీపీ ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తోంది. అలాగే జనసేన కూడా ఇప్పటికే తమ పార్టీలోకి చేరాలని ఆహ్వానం పంపిందని తెలుస్తోంది. 

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేలా సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారని టాక్ నడుస్తోంది. గత రెండు మూడు రోజులుగా గోదావరి జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే ఆయనను అధికార వైసీపీ ఎంపీగా పోటీ చేయాలని కోరుతోందని, అలాగే అవసరమైతే మరో రెండు, మూడు చోట్ల నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చిందని తెలుస్తోంది. 

బిపార్జోయ్ తుఫాన్ : దంపతులు ప్రయాణిస్తున్న బైక్ పై కూలిన చెట్టు.. భార్య మృతి, భర్తకు గాయాలు

కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ఆయనకు ఉభయ గోదావరి జిల్లాలో మంచి పేరు ఉందన్న సంగతి తెలిసిందే. గతంలో రాజకీయాల్లో ఆయన ఓ వెలుగు వెలిగారు. కానీ 2024 నుంచి ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. తుని ఘటన తరువాత ఆయన పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇటీవల తుని ఘటనకు సంబంధించిన కేసులన్నీ అధికార వైసీపీ కొట్టివేసింది. ఈ పరిణామం జరిగిన అనంతరం ఆయనను పార్టీలోకి ఆహ్వానించనట్టు తెలుస్తోంది.

సీఎం జగన్ తరఫున మాట్లాడేందుకు వైసీపీ గోదావరి జిల్లాలో బాధ్యుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన వద్దకు పంపించారని తెలుస్తోంది. పార్టీలో చేరితే కాకినాడ ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చారని సమాచారం. ఎంపీతో పాటు అవసరం అయితే ప్రత్తిపాడు, పెద్దాపురం శాసన సభ స్థానం నుంచి పోటీ చేయొచ్చని కూడా సూచించారని తెలుస్తోంది. ఒక వేళ ఆయన పార్టీలోకి చేరి, పోటీ చేయకపోతే.. కుమారుడిని పార్టీలోకి తీసుకోవాలని వైసీపీ భావిస్తోంది.

ట్విట్టర్ మాజీ సీఈఓది పక్షపాత ధోరణి..ప్రభుత్వ విమర్శకుల ఖాతాలు బ్లాక్ చేయాలని ఎవరూ చెప్పలేదు-రాజీవ్ చంద్రశేఖర్

కాగా.. వైసీపీతో పాటు జనసేన నాయకులు కూడా ముద్రగడతో మాట్లాడినట్టు సమాచారం. కాపుల హక్కుల కోసం పోరాడేందుకు తమ పార్టీలోకి రావాలని నాయకులు సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఈ రెండు పార్టీలోకి ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ ఆయన వైసీపీ వైపే అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో కుటుంబ సభ్యులతో, తన అనుచరలతో త్వరలోనే మాట్లాడి నిర్ణయం తీసుకోనున్నారని అర్థమవుతోంది. 

బీచ్ లో విషాదం.. లైఫ్ గార్డులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా సముద్రంలోకి దూకిన నలుగురు బాలురు మృతి..

2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకొని పోటీ చేయబోతున్నాయని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇలాంటి క్రమంలో ముద్రగడను పార్టీలోకి తీసుకుంటే వైసీపీకి బలం చేకూరే అవకాశం ఉంటుందని ఆ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది. అలాగే రెండు పార్టీలకు ఈ పరిణామం మింగుడు పడని విషయంగా మారుతుంది. కాగా.. ఆయనను వైసీపీ నుంచి పోటీలోకి దింపితే కాపులు ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల ఓట్లు తమ పార్టీకే పడుతాయని నాయకులు భావిస్తున్నారు. ఈ జిల్లాలో జనసేనకు చెక్ పెట్టాలంటే ఆయనను పార్టీలోకి తీసుకోవాల్సిందే అని వైసీపీ గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.