విశాఖపట్టణం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని  ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు  కాశీ విశ్వనాథ్ బుధవారం నాడు వైసీపీలో చేరాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

గంటా శ్రీనివాసరావు కొన్ని ప్రతిపాదనలు పంపాడన్నారు. జగన్ ఆమోదం పొందిన తర్వాత గంటా వైసీపీలో చేరే అవకాశం ఉందన్నారు. జగన్ పాలనను చూసి చాలా మంది వైసీపీలో చేరే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

also read:గంటాకు షాక్: ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథం వైసీపీలో చేరిక

ఎవరి నిర్ణయాలు ఎలా ఉన్నా జగన్ నిర్ణయమే ఫైనల్ అని విజయసాయిరెడ్డి చెప్పారు. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేర్చుకోవడాన్ని మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యతిరేకిస్తున్నారు.గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరే కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్ దూరంగా ఉన్నారు.

విశాఖపట్టణంలో కార్పోరేషన్ ను కైవసం చేసుకొనేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇతర పార్టీలకు చెందిన నేతలకు వైసీపీ గాలం వేస్తోంది.