మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథం బుధవారం నాడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో విశాఖలో వైసీపీలో చేరారు.

విశాఖపట్టణం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథం బుధవారం నాడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో విశాఖలో వైసీపీలో చేరారు.

త్వరలోనే విశాఖపట్టణం కార్పోరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి.ఈ కార్పోరేషన్ లో వైసీపీ జెండాను ఎగురవేయాలని ఆ పార్టీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల నుండి వలసలను వైసీపీ ప్రోత్సహిస్తోంది.

Scroll to load tweet…

ఈ క్రమంలోనే బుధవారం నాడు గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీ విశ్వనాథంతో పాటు టీడీపీ కార్యకర్తలు విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. కాశీ విశ్వనాథానికి కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలోనే టీడీపీ నుండి చాలా మంది వైసీపీలో చేరుతారని ఆయన చెప్పారు.

జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన చెప్పారు. వ్యక్తుల అభిప్రాయాల కన్నా పార్టీ తీసుకొన్న నిర్ణయమే ఫైనల్ అని ఆయన ప్రకటించారు. పార్టీని గెలుపు కోసం