వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో బుధవారం కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్ లో భేటీ అయ్యారు. కావలి నియోజకవర్గ రాజకీయాలను ఈ సందర్భంగా వంటేరు.. విజయసాయి రెడ్డితో చర్చించినట్లు సమాచారం.

జిల్లాలోని కొందరు వైసీపీ నాయకులు కావలి రాజకీయాలపై అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డికి అనుకూలంగా నివేదిక ఇచ్చారని దానివలన పార్టీకి నష్టం జరుగే అవకాశం ఉందని వంటేరు.. విజయసాయిరెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.  

మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డిని విస్మరిస్తే జిల్లాలో మూడు నియోజకవర్గాలలో పార్టీకి నష్టం వాటి ల్లే ప్రమాదం ఉందని ఈ విషయం జగన్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన తెలిపినట్లు తెలుస్తుంది. బుధ, గురు వారాలలో ఆయన జగన్‌ను కూడా కలిసి కావలి రాజకీయాలను వివరించ నున్నట్లు తెలిసింది.