వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబుకి ప్రజల సమస్యల గురించి కొంచెం కూడా ఆందోళన లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

ప్రజా సమస్యల కంటే తన కరకట్ట నివాసం, బినామీ ఆస్తులు, అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడం పైనే చంద్రబాబు ఆదోళనంతా అంటూ విమర్శలు చేశారు. అమరావతిని ఎంపిక చేసిందే తన బినామీ స్థిరాస్తి వ్యాపారం కోసం అని ఆరోపించారు. పునాదులు కూడా లేవని అమరావతిని చంపేశారని చంద్రబాబు శోకాలు పెడుతున్నారని విమర్శలు చేశారు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు శ్వేతపత్రాల పేరుతో పది బోగస్ పత్రాలను చంద్రబాబు వదిలారని విజయసాయి అన్నారు. అయినప్పటికీ టీడీపీకి పరాజయం తప్పలేదని గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతి, పోలవరాలపపై అడ్డగోలుగా అంచనాలు పెంచిన ప్రాజెక్టులపై వాస్తవ పత్రాలు బయపెడతామని అంటున్నారని ఎద్దేవా చేశారు. తాళపత్రాలు విడుదల చేసినా కూడా... ప్రజలు చంద్రబాబుని నమ్మే పరిస్థితిలో లేరని విజయసాయి అభిప్రాయపడ్డారు.