అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్.. ఇలా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారో లేదో.. మరో ఎంపీ వైసీపీలో చేరాలనుకుంటున్నారు. అమలాపురం ఎంపీ రవీంద్రబాబు.. టీడీపీని వీడి.. వైసీపీ తీర్థం పుచ్చుకోవాలనుకుంటున్నారు. కాగా.. ఆయన పార్టీ ఎందుకు మారాలనుకుంటున్నారో కూడా  ఆయన వివరించారు.

వచ్చే ఎన్నికల్లో అమలాపురం ఎంపీ టికెట్ తనకు ఇవ్వబోమని టీడీపీ స్పష్టం చేసిందట. అందుకే తాను పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ రవీంద్రబాబు వివరించారు. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు తాను జగన్ ని కలవనున్నట్లు తెలిపారు. 

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ఒక్కొక్కరుగా పార్టీ ని వీడుతున్నారు.ఇప్పటికే మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ లు వైసీపీలో చేరగా.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇంకెంత మంది పార్టీ నివీడే అవకాశం ఉందోనని అధిష్టానం టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు బుజ్జగించి.. పార్టీ మారకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.