పవన్ పై విమర్శల వర్షం కురిపించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

First Published 13, Jul 2018, 4:10 PM IST
mp rammohan naidu fire on pawan kalyan
Highlights

ఈ మూడు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఎం కుర్చీ నుండి దించేందుకే యత్నిస్తున్నానని.. అందుకు అనువైన విధంగానే పావులు కదుపుతున్నాయని.. ఈ విషయాలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ యువనేత, ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శల వర్షం కురిపించారు. ఓ సినీ నటుడు.. రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయాలిక తోచినట పనులు చేస్తున్నానడని ఎద్దేవా చేశారు.

పవన్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయనకు ఏ విషయం పై కూడా స్పష్టమైన అవగాహన ఉన్నట్లు  కనిపించడం లేదని.. ఏ అంశంపై కూడా క్లారిటీ లేని విధంగా ఆయన మాట్లాడుతున్నారని రామ్మోహన నాయుడు విమర్శించారు. బీజేపీ, వైఎస్సార్ పార్టీ, జనసేన పార్టీ.. ఈ మూడు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఎం కుర్చీ నుండి దించేందుకే యత్నిస్తున్నానని.. అందుకు అనువైన విధంగానే పావులు కదుపుతున్నాయని.. ఈ విషయాలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 

ఇప్పటికే కర్ణాటకలో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారని.. జీఎస్టీ, నోట్లరద్దు లాంటి అంశాల వల్ల ప్రజలు బీజేపీ పాలన పట్ల విముఖత కనబరుస్తున్నారని.. ఏపీలో కూడా బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కింజరపు రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం ఇప్పటికీ ఎన్నికల మీదే ప్రత్యేక దృష్టి ఉందని అన్నారు. 

loader