Asianet News TeluguAsianet News Telugu

జగన్ కి అహంకారం పెరిగిపోయింది, కుట్రలో ఆయనా భాగమే.. ఎంపీ రఘురామ

నామీద పెట్టిన కేసులు కోర్టుల్లో చెల్లవని, హోంశాఖ సెక్రటరీకి ఫిర్యాదు చేశానని ఏబీఎన్‌ డిబేట్‌లో రఘురామకృష్ణరాజు వెల్లడించారు. 

MP Raghurama Krishnama Raju Shocking Comments on YS Jagan
Author
Hyderabad, First Published Mar 6, 2021, 9:55 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన కామెంట్స్ చేశారు. సీఎం జగన్ కి అహంకారం బాగా పెరిగిపోయిందని రఘురామ పేర్కొనడం గమనార్హం. సీఎం పక్కనున్న వారు కుట్రలు చేస్తున్నారనుకున్నా.. కానీ ఆ కుట్రలో సీఎం కూడా ఉన్నారనుకోలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. 

నామీద పెట్టిన కేసులు కోర్టుల్లో చెల్లవని, హోంశాఖ సెక్రటరీకి ఫిర్యాదు చేశానని ఏబీఎన్‌ డిబేట్‌లో రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని రఘురామకృష్ణరాజు విమర్శించారు.


ఏ ముఖ్యమంత్రిని ఢిల్లీలో పట్టించుకోరని, కేంద్రానికి అన్ని రాష్ట్రాల సీఎంలు ఒక్కటే అని, ఎంపీలకు ఇచ్చిన ప్రధాన్యత సీఎంలకు ఇవ్వరని ఎంపీ అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేదని గతంలోనే చెప్పానని, నా పార్టీని నేనెప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మా పార్టీ ఇప్పటివరకు పార్లమెంట్‌లో విప్ ఇవ్వలేదని రఘురామకృష్ణరాజు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios