ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తనకు సవాలు విసిరారని.. ఆ సవాలను తాను స్వీకరిస్తానని ఆయన చెప్పారు. అయితే.. దానికంటే ముందు తానొక సవాలు విసురుతున్నట్లు ఆయన చెప్పారు.

 తాను రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే జగన్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్లీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని సూచించారు. అప్పుడు పెద్దిరెడ్డి సవాల్‌కు తాను సిద్ధమని తెలిపారు. 

‘‘నా కాళ్లు పట్టుకొని బతిమాలితే నేను జగన్‌ పార్టీలో చేరాను. నేను గనుక సీఎం అయితే అన్న నీ మాటల వెనుక ఉద్దేశం ఏంటో చెప్పాలి. మీ సీఎం అసమర్థుడా? చేతకాని వాడా? సమాధానం చెప్పు. చంద్రబాబుకు నేను బంట్రోతుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. రాజకీయంగా నాకు చంద్రబాబు ఉన్నత స్థానం ఇచ్చారు. చంద్రబాబును విమర్శించే స్థాయి నీకు లేదు. నా గెలుపునకు వైఎస్ విజయమ్మ, షర్మిల, జగన్ ఫొటోలు ఉంటే నా వ్యక్తిగత ఇమేజ్ కూడా తోడైంది. నేను సీఎం జగన్‌ను ఎప్పుడూ విమర్శించలేదు. ప్రభుత్వ పాలసీలను, విధానాలను, తప్పుచేస్తున్న వారిని మాత్రమే విమర్శించా. జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డిల దయవల్ల నువ్వు మంత్రి అయ్యావ్. ఇసుక ద్వారా ఎన్నివేల కోట్లు సంపాదిస్తున్నావో ప్రజలకు తెలుసు.’’ అని రఘురామకృష్ణంరాజు అన్నారు.