Asianet News TeluguAsianet News Telugu

జగన్‌కి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ: విషయం ఇదీ...

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మరో లేఖ రాశాడు. కష్టాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఆ లేఖలో ఆయన కోరారు. 

Narsapuram MP Raghurama krishnam Raju writes letter to Cm Jagan
Author
Amaravati, First Published Jul 14, 2020, 2:42 PM IST

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మరో లేఖ రాశాడు. కష్టాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఆ లేఖలో ఆయన కోరారు. 

రాష్ట్రంలో 20 లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకొన్నారని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు.  ఇందులో 10 లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్ తో లింక్ చేసినట్టుగా ఆయన తెలిపారు. మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

also read:అనర్హత పిటిషన్ బుట్టదాఖలు: ఎంపీ రఘురామకృష్ణంరాజు ధీమా

కరోనా నేపథ్యంలో ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ. 5 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని ఆయన ఇదివరకు రాసిన లేఖలో కోరారు. వృద్దాప్య పెన్షన్ వయోపరిమితిపై ఆయన లేఖలు రాశాడు.

సోమవారం నాడు రఘురామకృష్ణం రాజు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లాను కలిశారు. తనకు భద్రతను కల్పించాలని ఆయన కోరారు. స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చిన అనర్హత పిటిషన్ వల్ల ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నెపంతో ఆయనపై  వైసీపీ అనర్హత పిటిషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios