Asianet News TeluguAsianet News Telugu

ఎంపి మాటలు దేనికి సంకేతాలు

పోయిన ఎన్నికల్లో భాజపా నేతలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం వల్లే తనకు రావాల్సిన మెజారిటీ రాలేదంటూ ఆరోపించారు. ఈసారి భాజపాపై ఆధారపడకుండా తాము సొంతంగానే ప్రయత్నాలు చేసుకుంటామని చెప్పటంతో పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

MP made damaging comments on bjp

ఢిల్లీ రాజకీయ పరిణామాల నేపధ్యంలో మిత్రపక్షాల మధ్య దూరం పెరుగుతున్నట్లే ఉంది. విజయవాడ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు పెరుగుతున్న దూరాన్నే సూచిస్తోంది. అదికూడా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడ పర్యటనకు వస్తున్న సమయంలో టిడిపి  ఎంపి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీసాయి. విజయవాడలోని పార్టీ కార్యక్రమంలో ఎంపి కేశినాని నాని మాట్లాడుతూ, పోయిన ఎన్నికల్లో భాజపా నేతలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం వల్లే తనకు రావాల్సిన మెజారిటీ రాలేదంటూ ఆరోపించారు. ఈసారి భాజపాపై ఆధారపడకుండా తాము సొంతంగానే ప్రయత్నాలు చేసుకుంటామని చెప్పటంతో పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ఎంపి మాటలు దేనికి సంకేతాలంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రధానమంత్రి సమవేశమైన సంగతి తెలిసిందే కదా? అప్పటి నుండి ఇరుపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారస్ధాయికి చేరుకుంది. అప్పటికే ఇరు పార్టీలనేతల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత క్షీణించాయి. చంద్రబాబు నిర్వహించే ఏ కార్యక్రమానికైనా సరే వెంకయ్య ఉరుకులుపరుగుల మీద వాలిపోతారు. అటువంటిది ఇపుడు వెంకయ్యకూడా హాజరుకావటంలేదు. దాంతో రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగినట్లుగానే సర్వతా చర్చ జరుగుతోంది.

ఈ నేపధ్యంలోనే ఎంపి కేశినేని నాని వ్యాఖ్యలు అందరి అనుమానాలను పెంచుతోంది. పైగా పోయిన ఎన్నికల్లో భాజపా క్రాస్ ఓటింగ్ కు పాల్పడిందని ఆరోపించటం సర్వత్రా చర్చ మొదలైంది. రానున్న ఎన్నికల్లో టిడిపి సొంత ఏర్పాట్లు చేసుకుంటుందని కూడా అన్నారు. నిజానికి ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇపుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. రెండు పార్టీల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న సమయంలో పనిగట్టుకుని మరీ ప్రస్తావించారంటే అర్ధం ఏమిటి? చంద్రబాబు నుండి నేతలకు ఏమైనా అంతర్లీనంగా సంకేతాలు అందాయా అన్న చర్చ కూడా పార్టీలో మొదలైంది. ఏదేమైనా ఈ 25వ తేదీ విజయవాడలో అమిత్ షా పర్యటనతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios