చంద్రబాబు తర్వాత.. ముఖ్యమంత్రి అయ్యే  అర్హత  లోకేష్ కి మాత్రమే ఉందని ఎంపీ కేశినేని అభిప్రాయపడ్డారు.  కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడులో నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో ఆయన మాట్లాడారు.

 ప్రజాసేవకు టీడీపీ ప్రభుత్వమే నిదర్శనమని ఆయన అన్నారు.  గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులను జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజల ముంగిటకు తీసుకొస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కిందన్నారు. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తూ కోతలు లేకుండా చేశారని తెలిపారు. 

సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్‌కు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అర్హత నూరు శాతం ఉందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, ఆయనకు సమాధానం చెప్పడానికి నేనొక్కడిని చాలన్నారు.