పవన్, జగన్ ల మధ్య సయోద్యకు ప్రధాని ప్రయత్నం : జెసి సంచలనం

MP JC Diwakar Reddy Speech at TDP MP's Nirasana Deeksha in Anantapur
Highlights

వైఎస్సార్ సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమ్మ కడుపులో ఉండగానే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడని టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి విమర్శించారు. ఇక జనసేన అధినేత పవన్ పుట్టిన తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. దీంతో వీరిద్దరి మద్య సయోద్య కుదరడం లేదని అన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం వీరి మద్య సయోద్య కుదుర్చడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వైఎస్సార్ సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమ్మ కడుపులో ఉండగానే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడని టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి విమర్శించారు. ఇక జనసేన అధినేత పవన్ పుట్టిన తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. దీంతో వీరిద్దరి మద్య సయోద్య కుదరడం లేదని అన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం వీరి మద్య సయోద్య కుదుర్చడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇవాళ అనంతపురం ఆర్ట్స్ కళాశాల వద్ద టిడిపి ఎంపీలు కేంద్ర వైఖరికి నిరసనగా దీక్షకు దిగారు. ఈ సంధర్భంగా జెసి మాట్లాడుతూ..ఈ దీక్షల వల్ల ఒరిగేదేమీ లేదని అన్నారు. కేవలం తాము ప్రజలు సానుభూతిని, ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను చెప్పుకోడానికే దీక్షలు చేస్తున్నామని అన్నారు. ఈ నిరసనల వల్ల కేంద్ర ప్రభుత్వం స్పందించదని జెసి అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పొగడాల్సిన అవసరం తనకు లేదని ఎంపి జెసి దివాకర్ రెడ్డి  వ్యాఖ్యానించారు. తన కంటే జూనియర్లయిన కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత లకు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే వారికి పదవులు రావడాన్ని తాను వ్యతిరేకించడం లేదని కానీ తనకు రాకపోవడంతోనే ఆవేధన వ్యక్తం చేస్తున్నట్లు జెసి తెలిపారు.

 ఇక ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నంత కాలం ఏపికి న్యాయం జరగదని విమర్శించారు. ఆయన రాష్ట్రానికి చిన్న బెల్లం ముక్క ఇవ్వరని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి కూడా చెప్పానని, కానీ రాష్ట్ర ప్రచోజనాల కోసం పోరాడుతూనే ఉండాలని ఆయన సూచించారని జెపి తెలిపారు. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నపుడు అంతో ఇంతో ఏపీకి న్యాయం జరిగిందని అన్నారు. ఆయన ఉపరాష్ట్రపతి కావడం కూడా రాష్ట్రానికి శాపమైందని ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.  
 
సీఎం రమేష్ చేపట్టిన దీక్షపై కూడా జెసి మరోసారి మాట్లాడారు. ఉక్కు ప్యాక్టరీ కోసం రమేష్ సన్యాసిలా గడ్డం పెంచుతానని ప్రకటించారని, ఆయన ఇంకా సంవత్సరం పాటు ఇలానే పెంచాల్సి ఉంటుందని అన్నారు. ఎందుకంటే మరో సంవత్సరం పాటు ప్రధానిగా మోదీ ఉండనున్నారని  అందువల్ల రాష్ట్రానికి న్యాయం కోసం అప్పటివరకు వేచివుండాలని అన్నారు. 
 
దేశంలో మంత్రులు అంటే ఇద్దరే ఉంటారని జెసి తెలిపారు. ఒకరు ప్రధానమంత్రి కాగా మరొకరు ముఖ్యమంత్రి అని అన్నారు. మిగతా మంత్రులంతా కూరలో కరివేపాకులేనని ఎద్దేవా చేశారు. ఈ మంత్రులకు మొగుళ్లుగా సెక్రటరీలు మారారని అన్నారు. ఈ సెక్రటరీలు ముఖ్యమంత్రులను కూడా తప్పుదోవ పట్టిస్తారని తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వారి ఆటలు సాగనివ్వరని జెసి దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

loader