అలా చేయకపోతే బాబుకు నష్టమే: జేసీ సంచలనం

MP JC diwakar Reddy praises   Chandrababunaidu
Highlights

జగన్ పై జేసీ హాట్ కామెంట్స్

అనంతపురం: 2019లో గెలిచే అభ్యర్ధులకే టిక్కెట్లు
ఇవ్వకపోతే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నష్టపోతారని  
అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.

శనివారం నాడు అనంతపురంలో జెసీ దివాకర్ రెడ్డి
మీడియాతో మాట్లాడారు. అనంతపురంలో తాను అనేక
అభివృద్ది కార్యక్రమాలకు అడ్డుపడుతున్న వారు
మురికికాలువలో కొట్టుకుపోతారని ఆయన ఆగ్రహాం వ్యక్తం
చేశారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై తాను చేసిన విమర్శలకు కట్టుబడి
ఉన్నానని ఆయన చెప్పారు. వాటిని నిరూపించేందుకు
కూడ సిద్దమేనని ఆయన చెప్పారు.

ప్రాంతీయ పార్టీల్లో వంశపారంపర్య పాలన ఉంటుందని,
ఇది అన్ని రాష్ట్రాల్లోనూ ఉందన్నారు. 
మహానాడులో తాను చేసిన వ్యాఖ్యలను
సమర్థించుకున్నారు. తానెవరినీ తప్పుపట్టలేదని, జగన్‌
కుటుంబాన్ని దూషించలేదని అన్నారు.

 

కాగా, ఏపీలోచంద్రబాబు పాలన అద్భుతంగా ఉందని, ఎండాకాలంలోనే
చెరువుల్లో నీరు ఉంటోందని వ్యాఖ్యానించారు

loader