హైదరాబాద్: సినీక్రిటిక్ కత్తి మహేశ్ ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైసీపీలో చేరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తోట త్రిమూర్తులు లాంటి దళిత పీడకుడిని పార్టీలోకి ఆహ్వానించి వైయస్ఆర్సీపీ దళితులకి చాలా ప్రమాదకరమైన సందేశాన్ని పంపిస్తోందని ఆరోపించారు. 

తోట త్రిమూర్తులను పార్టీలోకి తీసుకుని దళితులను దూరం చేసుకునే అవకాశం లేకపోలేదన్నారు. తోట త్రిమూర్తులను వైసీపీలో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి,పార్టీ పెద్దలు మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు. 

ఇకపోతే రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ కీలక నేత తోట త్రిమూర్తులు ఈనెల 15న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తోట త్రిమూర్తులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.