ఓటుకునోటు: చంద్రబాబుకు సంబంధమే లేదు

Motkuplli says naidu has no role in vote for cash episode
Highlights

  • ఎవరికీ తెలీని ఓ విషయాన్ని తెలంగాణా టిడిపిలో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తాజాగా బయటపెట్టారు.
  • ఇంతకీ ఆ విషయమేంటంటే ? ఓటుకునోటు కేసులో అసలు చంద్రబాబునాయుడు పాత్రే లేదట.

రెండు రాష్ట్రాల్లో రెండేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన ‘ఓటుకునోటు’ కేసు అందరికీ తెలిసిందే. అందులో పాత్రదారులెవరు ? సూత్రదారులెవరు? అన్న విషయంలో యావత్ ప్రపంచం మొత్తానికి ఓ అవగాహనుంది. వీడియో సాక్ష్యంగా దొరికింది ఎవరు? బయటపడిన ఆడియో టేపుల్లో వినిపించిన గొంతు ఎవరిదో అందరికీ తెలుసు. అయితే, ఎవరికీ తెలీని ఓ విషయాన్ని తెలంగాణా టిడిపిలో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తాజాగా బయటపెట్టారు. ఇంతకీ ఆ విషయమేంటంటే ? ఓటుకునోటు కేసులో అసలు చంద్రబాబునాయుడు పాత్రే లేదట.

ఓటుకునోటు కేసు మొత్తం రేవంత్ సొంత వ్యవహారమట. తనంతట తానుగా సొంతంగా నిర్ణయంగా తీసుకుని చంద్రబాబును గబ్బు పట్టించారట. రేవంత్ వల్లే తెలంగాణాలో టిడిపి భ్రష్టుపట్టిపోయిందట. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్-టిడిపి మధ్య పొత్తులుంటాయని ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ అదే నిజమైతే ఓటుకునోటు కేసులో నుండి చంద్రబాబును తప్పించి రేవంత్ ను మాత్రమే ఇరికించే వ్యూహమేదన్నా మొదలైందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

loader