కరోనా ఎఫెక్ట్: కవలలకు దూరమైన తల్లి, స్వదేశం వచ్చేందుకు ప్రయత్నాలు

కరోనా కారణంగా ఇద్దరు చిన్నారులకు ఓ తల్లి దూరమైంది. మలేషియాలో ఉన్న ఓ తల్లి విశాఖలో ఉన్న తన పిల్లలను చూసుకొనేందుకు ఇండియాకు వచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరుతోంది. ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. 

Mother of twins stranded in Kuala Lumpur, kids in visakhapatnam


విశాఖపట్టణం: కరోనా కారణంగా ఇద్దరు చిన్నారులకు ఓ తల్లి దూరమైంది. మలేషియాలో ఉన్న ఓ తల్లి విశాఖలో ఉన్న తన పిల్లలను చూసుకొనేందుకు ఇండియాకు వచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరుతోంది. ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. 

విశాఖపట్టణంలోని శివాజీ పాలెం ప్రాంతానికి చెందిన సింధూష కొన్నేళ్ల క్రితం విజయ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకొంది. పెళ్లి చేసుకొన్న తర్వాత భర్త విజయ్ తో సింధూష మలేషియాలో  నివాసం ఉంది.

Also read:కరోనా ఎఫెక్ట్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలెర్ట్, విదేశీ ప్రయాణీకులపై నిఘా

గత ఏడాది డెలీవరీ కోసం ఆమె మలేషియా నుండి విశాఖపట్టణానికి వచ్చింది. ఏడు మాసాల క్రితం ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఇటీవలనే ఆమె తన వీసా రెన్యూవల్ కోసం విశాఖపట్టణం నుండి మలేషియాకు తిరిగి వెళ్లింది.

వీసాను రెన్యూవల్ చేసుకొంది. అయితే ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించింది. దీంతో మలేషియా నుండి ఇండియాకు వచ్చే విమాన సర్వీసులను రద్దు చేశారు. 

దీంతో సింధూష మలేషియాలోనే చిక్కుకుపోయింది. తల్లి కోసం ఇద్దరు చిన్నారులు విశాఖలో పడిగాపులు కాస్తున్నారు. సింధూష తల్లి ఆ చిన్నారుల ఆలనా పాలనా చూస్తోంది. ఇదే సమయంలో తన పిల్లలను చూసేందుకు ఇండియాకు వచ్చేందుకు సింధూష మలేషియాలోని భారత ఎంబసీ అధికారులను కలుసుకొంది.

కానీ విమాన సర్వీసులు రద్దు చేయడంతో తాము ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నట్టుగా  అధికారులు తేల్చి చెప్పినట్టుగా సింధూష చెబుతున్నారు. ప్రతి రోజూ ఇండియయన్ ఎంబసీ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె మీడియాకు తన గోడును చెప్పుకొంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. విశాఖకు వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios