కరోనాతో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని చిధ్రం చేసింది. తల్లికొడుకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేసింది. ఈ విషాదకర ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

విశాకపట్నం, మారికవలస రాజీవ్ గృహకల్పన కాలనీలో బ్లాక్ నెంబర్ 57లో నివాసం ఉంటున్న  శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన రవికుమార్, భార్య సరిత ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. 

"

వీరు ఆనందపురం జంక్షన్ లో హోటల్ నడుపుతున్నారు. కొంతకాలంగా వ్యాపారంలో నష్టాలు రావటంతో ఆర్ధికంగా   ఇబ్బందిపడ్డారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక సొంత హోటల్ మూసేశారు. దీంతో కుటుంబం గడవడానికి రవి వేరే హోటల్లో, సరిత ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. 

అయినా కూడా గతంలోని నష్టలను పూర్తి స్థాయిలో తీర్చలేకపోవడంతో  ఆర్ధికంగా చాలా ఇబ్బంధులను ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రవికుమార్ విధులకు వెళ్ళగా, భార్య సరిత, చిన్న కొడుకు చేతన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. 

దీంతో ఘటనా స్థలానికి చేరిన పి.యం పాలేం పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి, ఎసిపి కుమార్ స్వామి ,సి.ఐ దర్యాప్తు చేస్తున్నారు.