జీడిపప్పు హోల్ సేల్ దుకాణంలో దొంగలు పడి.. భారీగా నగదు చోరీ  చేశారు. ఈ సంఘటన సత్తెనపల్లిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ రాముల వారి గుడి వద్ద ఉన్న వెంకటసాయి ట్రేడర్స్ జీడిపప్పు హోల్ సేల్ దుకాణంలో భారీ చోరీ జరిగింది. దొంగలు దుకాణంలోకి చొరబడి లక్షా యాభై వేల రూపాయలు నగదు, 40 లక్షల విలువైన వోచర్స్ అపహరించారు.

ఉదయం  దుకాణం తలుపులు తెరిచి చూసిన యజమాని కొప్పురావురి శ్రీనివాసరావు(నార్నేపాడు) క్యాష్ కౌంటర్ తెరచి ఉంటడం చూసి నిర్ఘాంతపోయాడు.వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్టు యజమాని శ్రీనివాసరావు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.