మీ బ్యాంక్ ఎకౌంట్లో ఉన్నపళంగా డబ్బులు పడితే ఎలా ఉంటుంది. రూపాయి లేని ఎకౌంట్ లో ఒక్కసారిగా వేలకు వేలు డిపాజిట్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

తమ ఎకౌంట్ లో ఎవరు డబ్బులు వేశారో తెలియక జనం తికమక పడ్డారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మంది ఖాతాల్లో రూ.10వేల నుంచి రూ.16వేల వరకు ఖాతాల్లో జమ అయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సాలూరు మండలం, శివారాంపురం గ్రామంలో 607 కుటుంబాలున్నాయి. వీరిలో 200 మంది ఖాతాల్లో రూ.13,500 నుంచి రూ.16 వేల వరకు క్రెడిట్ అయ్యింది. తొలుత రైతు భరోసాకు చెందిన నగదుగా జనం భావించారు.

అయితే వ్యవసాయ భూమి లేని వారి ఖాతాల్లో కూడా నగదు జమ కావడం చర్చనీయంశమైంది. కొంత మంది నగదు జమ అయిన వ్యవహారాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా..కొంత మంది ఎందుకొచ్చి గొడవని సైలెంట్ గా ఉంటున్నారు.

దీనిపై బ్యాంక్ అధికారులను ప్రశ్నించగా అలంటిదేమీ లేదంటున్నారు. ప్రస్తుతం బ్యాంక్ ఎకౌంట్ తో ఆధార్ లింక్ అయినందున పొరబాటుగా నగదు జమయ్యే అవకాశమే లేదని దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు.