మిత్రుడిని తాగుడుకు బానిస చేసి, భార్యపై అత్యాచారం.. వీడియోలు, ఫొటోలతో బ్లాక్ మెయిల్.. దంపతుల ఆత్మహత్యాయత్నం..
నెల్లూరులో ఓ వ్యక్తి స్నేహితుడిని మద్యానికి బానిస చేసి.. భార్య మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పాడ్డాడు. ఆమె వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ కు దిగాడు. దీంతో ఆ దంపతులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశారు.
నెల్లూరు : Nellore Districtలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగి suicideకు ప్రయత్నించిన ఘటన లింగసముద్రం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. తన భర్తను తాగుడుకు బానిస అయ్యేలా చేయడంతోపాటు.. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అందుకే తామిద్దరం చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆత్మహత్యకు ముందు ఓ Selfie videoలు తీసుకున్నారు. ఓ లేఖ కూడా రాశారు.
పోలీసుల కథనం ప్రకారం… ‘నా చావుకు, నా భర్త చావు కారణం షేక్ ఇలియాజ్.. నా భర్తను తాగుడికి బానిస అయ్యేలా చేశాడు. ఆయన ద్వారా నాకు మత్తు మందు ఇచ్చి సృహ తప్పి పడిపోయిన తర్వాత పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన సమయంలో ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు. మమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మేము ఇద్దరం కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా చావు తర్వాత అయినా అతనికి శిక్ష పడుతుందని కోరుకుంటున్నాం’ అని బాధితురాలు ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో పేర్కొంది.
ఆ తర్వాత దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి ముందు దంపతులిద్దరూ సెల్ఫీ వీడియో ద్వారా తమ బాధను వ్యక్తం చేశారు. నిందుతుడు వారిని ఎలా బ్లాక్ మెయిల్ చేసిందీ వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు మాజీ మేయర్ హేమలత పైకి పోలీస్ జీపు... కాళ్లకు గాయాలు..
ఇదిలా ఉండగా, తాను వివాహం చేసుకున్న యువతికి ఆమె తల్లిదండ్రులు మరొకరితో పెళ్లి చేశారనే విషయాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జూన్ 10న వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు అనంతపురంలోని గౌరీ థియేటర్ సమీపంలో నివసిస్తున్న బాలకృష్ణ సింగ్ రాడ్ బెండింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తిరుమలకు వెళ్లిన ఆయనకు కలువాయి మండలానికి చెందిన ఓ యువతితో పరిచయమై అది ప్రేమగా మారింది.
ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను కావలిలోని తమ బంధువుల ఇంట్లో ఉంచి వివాహానికి ప్రయత్నాలు చేశారు. దీంతో గతేడాది మేలో బాలకృష్ణ సింగ్, యువతి పారిపోయి వివాహం చేసుకుని అనంతపురంలో కాపురం పెట్టారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన కావలి పోలీసులు అనంతపురంలో ఉన్న వీరిని తీసుకువచ్చారు.
యువతి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పదిరోజుల్లో వివాహం చేస్తామని తమ కుమార్తెను వెంట తీసుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమె జాడ తెలియరాలేదు. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో బాలకృష్ణ సింగ్ పెట్టడంతో యువతి కుటుంబ సభ్యులు దిశ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణకు గాను ఈ నెల 6న ఆయన హాజరయ్యారు. అతని మొబైల్ ఫోన్ లోని ఫోటోలను పోలీసులు డిలీట్ చేయించి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరుసటిరోజు కౌన్సెలింగ్ చేశారు.
ఈ క్రమంలో తన కుమార్తె వివాహం చేశామని, ఆమె జోలికి రావద్దని తల్లిదండ్రులు సూచించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఫోన్ కోసం దిశ పోలీస్ స్టేషన్ కు బుధవారం బయలుదేరిన బాలకృష్ణ సింగ్.. సమీపంలోని చెట్ల వద్ద తలకు రాసుకునే ఆయిల్ ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం జిజిహెచ్ లో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసును బుధవారం అర్ధరాత్రి నమోదు చేశారు.