Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరు మాజీ మేయర్ హేమలత పైకి పోలీస్ జీపు... కాళ్లకు గాయాలు..

చిత్తూరులో టీడీపీ మాజీ మేయర్ కఠారి అనూరాధ మీదికి పోలీసు జీపు పోనివ్వడంతో ఆమె రెండు కాళ్లకు గాయాలయ్యాయి. తేలికగా తేలికపాటి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. 
 

Police jeep on former mayor Hemalatha in Chittoor
Author
Hyderabad, First Published Jun 24, 2022, 6:54 AM IST

చిత్తూరు : Chittoorలో గురువారం అర్థరాత్రి కలకలం రేగింది. రాత్రి 11 స్థానిక సంతపేటలోని former mayor, టిడిపి నగర అధ్యక్షురాలు Katari Hemalata అనుచరుడైన పూర్ణ ఇంటికి వచ్చిన పోలీసులు మీ ఇంట్లో  గంజాయి ఉందంటూ  సోదా చేశారు. తన దగ్గర అలాంటిదేమీ లేదని,  తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు అంటూ పూర్ణ ఆందోళనకు దిగారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన హేమలత తన అనుచరులతో కలిసి  పోలీసు జీపు వెనక బైఠాయించారు. అయినా జీపును రివర్స్ చేసి  పోనివ్వమని సిఐ ఆదేశించారని, దీంతో వాహనం హేమలత కాళ్లపై నుంచి వెళ్లి పోయిందని ఆమె అనుచరులు ఆరోపించారు.

గాయపడిన హేమలతను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. తన అత్తమామలైన దివంగత మేయర్ కఠారి అనురాధ, మోహన్ హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని హేమలత సాయంత్రం ఏఎస్పీ జగదీష్ కు వినతి పత్రం సమర్పించి, విలేకరులతో మాట్లాడారు. కొద్ది గంటల్లోనే ఈ నాటకీయ పరిణామాలు చకచకా చోటుచేసుకోవడం గమనార్హం.

గంజాయి బస్తాలను పెట్టబోయారు…
మేయర్ దంపతుల హత్య కేసులో హేమలత  అనుచరుడు ప్రసన్న సాక్షిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రసన్న తమ్ముడు.. పూర్ణ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడంటూ చిత్తూరు టూ టౌన్ పోలీసులు రాత్రి 8 గంటలకు స్టేషన్ కు తీసుకు వెళ్లారు. అప్పటికే  పోలీసులు వారి దగ్గరున్న గంజాయి బస్తాలను ఇంట్లో పెట్టేందుకు ప్రయత్నించగా, తాము అడ్డుకున్నట్లు తల్లి, వదిన చెబుతున్నారు. దీంతో ఓబసపల్లెలో తనకున్న మరో ఇంట్లో ఒక గంజాయి బస్తా పెట్టారని ఆరోపిస్తున్నారు. తమ ఇంట్లో గంజాయి పెట్టి అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని పూర్ణ ఆందోళనకు దిగారు. 

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి ఇంటికి పోలీసులు.. నర్సీపట్నంలో మరోసారి ఉద్రిక్తత

హేమలత, పలువురు టీడీపీ నేతలు అక్కడికి వచ్చి ఆ బస్తాల్లో ఏముందో చూపించాలని పోలీసులను అడిగారు. అవన్నీ చూపించడం కుదరదంటూ పూర్ణను మళ్లీ జీపులోకి ఎక్కించారు. అతడిని కిందికి దించాలంటూ హేమలత, నేతలు జీపు వెనక వైపునకు వెళ్లి అడ్డుగా కూర్చున్నారు. జీపును రివర్స్ చేసే క్రమంలో హేమలత కాళ్లపై నుంచి వెళ్ళిపోయింది. గాయపడిన ఆమెను హుటాహుటిన నేతలు, అనుచరులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు కాళ్ల ఎముకల్లో స్వల్పంగా పగుళ్లు వచ్చినట్లు వైద్యులు చెప్పారు. హేమలత కడుపులో నొప్పిగా ఉండటంతో 1:00 సమయంలో అల్ట్రాసౌండ్ స్కాన్ తీశారు. వైద్యుల  నిర్ణయాన్ని బట్టి వేలూరు సిఎంసీకి తరలించే అవకాశం ఉంది.

తగలకపోయినా ఎక్కించామంటున్నారు..
పూర్ణ ఇంట్లో సోదాలు చేయగా తమకు గంజాయి లభించిందని చిత్తూరు టూటౌన్ సీఐ చెప్పారు. టిడిపి నేతలు అడ్డంగా ఉన్నారని.  వారికి వాహనం తగలకపోయినా.. ఎక్కించామని ఆరోపిస్తున్నారని అన్నారు.

హత్య కేసును నీరుగార్చేందుకే…
దివంగత మేయర్ కఠారి అనురాధ, మోహన్ హత్య కేసును నీరుగార్చేందుకు పోలీస్ కుట్రపన్ని అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే రాజసింహులు, టీడీపీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే గంజాయి అక్రమ రవాణా అంటూ కొత్త నాటకానికి తెర తీశారని ఆరోపిస్తున్నారు. ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరాతీశారు. హేమలతకు అండగా నిలవాలని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios