గుంటూరు జిల్లాలో రియల్టర్లు లక్షల ఎకరాల్లో లే-అవుట్లు వేసి రైతుల ముసుగులో ఎరువుల సబ్సిడీలు పొందుతున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుకు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో రియల్టర్లు లక్షల ఎకరాల్లో లే-అవుట్లు వేసి రైతుల ముసుగులో ఎరువుల సబ్సిడీలు పొందుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నకిలీ విత్తనాలకు గుంటూరు జిల్లా అడ్డాగా మారిందన్నారు. ఎరువుల మిక్సింగ్ ప్లాంట్లో కల్తీ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచారాల కోసమే సోదాలు చేస్తున్నట్లుగా ఉందని మోదుగుల మండిపడ్డారు.