అసెంబ్లీలో వైసీపీ ఉంటేనే బాగుంటుంది..

అసెంబ్లీలో వైసీపీ ఉంటేనే బాగుంటుంది..

అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. ఆ లోటును అధికార పక్షంలోని చాలా మంది ఫీలవుతున్నారు. ఎందుకంటే, అసెంబ్లీ సమావేశాలు మొదలైన మూడు రోజుల్లో మొదటినుండి ఆఫ్ ది రికార్డు టిడిపి సభ్యులు ఈ విషయాన్ని మాట్లాడుకుంటూనే ఉన్నారు. కాకపోతే టిడిపి సభ్యుడు మోదుగుల వేణుగోపాల రెడ్డి బహిరంగంగానే మంగళవారం ఆ విషయాన్ని అంగీకరించారు. అసెంబ్లీలో వైసీపీ లేకపోవటంతో సమావేశాలు చప్పగా నడుస్తున్నాయట.

అసెంబ్లీ అనేది మోడ్రన్ దేవాలయమని, ఇక్కడ ప్రజా సమస్యలు చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షం లేకపోవడంతో సభ చప్పగా ఉందని అభిప్రాయపడ్డారు. మళ్ళీ  2018 లో బడ్జెట్ సెషన్స్ జరుగుతాయని, అప్పుడు కూడా ఇలాగే భహిష్కరిస్తారా అంటూ సందేహం వ్యక్తం చేసారు. చంద్రబాబునాయుడు ఫిరాయింపులకు నిరసనగానే వైసీపీ సమావేశాలను బహిష్కరిస్తోందన్న విషయం మోదుగులకు తెలియందేమీ కాదు. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా అందుకనే  ‘సమావేశాలను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయాన్ని జగన్ పునరాలోచించాలం’టూ విజ్ఞప్తి చేసారు. అయినా సభలో ప్రతిపక్షం లేకపోయినా తమ సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు అంటూ సమాధానం చెప్పుకున్నారు లేండి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos