విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ లో విషవాయువు లీకైన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఈ విషయమై  సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

 

గురువారంనాడు తెల్లవారుజామున ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి విషవాయిువు లీకైంది.ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. పశువులు కూడ మృతి చెందాయి.

also read:విషవాయువు లీక్: వెంకటాపురంలో ఇళ్లలో రెస్క్యూ సిబ్బంది తనిఖీలు

ఈ విషయమై ప్రధాని మోడీ విపత్తు నివారణ శాఖ అధికారులతో మాట్లాడారు. అస్వస్థతకు గురైన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

కేంద్ర హోంశాఖ అధికారులతో విపత్తు నివారణ శాఖాధికారులతో ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.బాధితులకు వైద్య సేవలు అందేలా వైద్య ఆరోగ్య శాఖాధికారులతో కూడ మాట్లాడినట్టుగా ఆయన వివరించారు.విశాఖపట్టణంలో స్టైరెన్ గ్యాస్ లీకైన ఘటనలో ఎన్‌డీఎంఏ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు ప్రధాని మోడీ.