చంద్రబాబునాయుడు పరిపాలను దేవుడే మెచ్చాడంటూ టిడిపి నేతలు అంటున్నారు. అందుకే నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా రాయలసీమలో వర్షాలు కురిసినట్లు చెబుతున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో గురజాల ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, చంద్రబాబు పాలనను దేవుడే మెచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారని చెప్పారు. కాబట్టి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ఎందుకు పనికిరావని ఎద్దేవా చేసారు.

విజయవాడ పవిత్రసంగమంలో అత్యంత పవిత్రంగా చంద్రబాబు జలహారతి ఇవ్వటం వల్లే వరుణుడు కరుణించారట. తన తండ్రి వయసుండే చంద్రబాబును జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం వల్లే నంద్యాల, కాకినాడలో జనాలు తిప్పికొట్టినట్లు గుర్తుచేసారు. తమ పథకాలను కాపీ కొట్టే జగన్ నవరత్నాలను ప్రకటించారని మండిపడ్డారు. మూడున్నరేళ్ళ టిడిపి పాలనలో 95 శాతం జనాలు సంతృప్తిగా ఉన్నారని యరపతి చెప్పారు.