Asianet News TeluguAsianet News Telugu

పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? : వల్లభనేని వంశీ ధ్వజం

పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? 14 యేళ్లు సీఎంగా చంద్రబాబు ఏం చేశారంటూ.. వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్ అయ్యారు. ఏపీ వ్యాప్తంగా రెండో రోజు  ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతుంది. బాపులపాడు మండలం ఏ. సీతారాంపురంలో  శనివారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 
 
MLA Vallabhaneni Vamsi Sensational Comments On Chandrababu - bsb
Author
Hyderabad, First Published Dec 26, 2020, 2:35 PM IST

పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? 14 యేళ్లు సీఎంగా చంద్రబాబు ఏం చేశారంటూ.. వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్ అయ్యారు. ఏపీ వ్యాప్తంగా రెండో రోజు  ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతుంది. బాపులపాడు మండలం ఏ. సీతారాంపురంలో  శనివారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గన్నవరం నియోజకవర్గంలో 25,500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసురాలేదన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొమ్మిది వేల కోట్లు వెచ్చించి భూములను కొనుగోలు చేసి పేదలకు ఇస్తున్నారని తెలిపారు. ఇళ్ల స్థలాల సేకరణలో అవినీతి జరిగితే టీడీపీ నేతలు నిరూపించవచ్చని ఆయన సవాల్‌ విసిరారు.

‘‘చంద్రబాబు హయాంలో పేదలకు ఇళ్లు ఇవ్వలేకపోయారు. ఇచ్చేవారిని అడ్డుకుంటున్నారు. పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? సీఎం వైఎస్‌ జగన్‌.. టీడీపీ వారికి సైతం ఇళ్లపట్టాలు ఇస్తున్నారు. చంద్రబాబుకి ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టం లేదు. ఆయన పోలవరం కట్టకుండానే భజనలు చేయించుకున్నారు. మనువడికి పోలవరం చూపించేందుకు డబ్బులు ఖర్చు చేశారు. 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏమి చేశారో చెప్పాలని’’ వల్లభనేని వంశీ ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios