తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల సమయంలో తీసుకున్న డబ్బు ఇవ్వలేదని వైసీపీ నేత మేకల రవి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన భర్త మోసం చేశాడని శ్రీదేవి రూ.1.40 కోట్లు తీసుకుందని మేకల రవి తెలిపారు.

రూ.40లక్షలు తిరిగి ఇచ్చిందని.. మిగతా రూ.80 లక్షలు అడిగితే బెదిరిస్తుందని చెప్పారు. రూ.80 లక్షలు అడిగితే డీసీఎంఎస్ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు సరిపెట్టుకోవాలని అంటోందని మేకల రవి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు కోసం శ్రీదేవి ఇంటికెళ్తే దుర్భాషలాందని వాపోయారు. ఎస్పీకి ఫోన్  చేసి లోపల వేయిస్తానంటూ బెదిరించిందని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీదేవి అరాచకాలపై జగన్ దృష్టి పెట్టాలని మేకల రవి కోరారు.