తిరుపతి: కరోనాతో మరణించిన మృతదేహాల అంత్యక్రియల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. కరోనాతో మరణించిన రోగుల అంత్యక్రియలపై తొలగించేందుకు కరుణాకర్ రెడ్డి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తిరుపతిలోని కరకంబాడీ రోడ్డులోని గోవింద ధామంలో కరోనా రోగి అంత్యక్రియల్లో ఆదివారం నాడు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.  కరోనా రోగుల మృతదేహాల ఖననంపై అపోహాలు తొలగించేందుకు  ఈ అవగాహన కోసం ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కరోనా సోకి మరణించిన వారి అంత్యక్రియల విషయంలో రాష్ట్రంలోని పలు చోట్ల ప్రజలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజల్లో నెలకొన్న అపోహాలను తాను స్వయంగా అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

తగిన జాగ్రత్తలతో కోవిడ్ మృతులకు కూడ అంత్యక్రియలు జరుపుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పించేందుకు  ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష తదితరులు పాల్గొన్నారు.