అమరావతి:  చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్  వర్గీయులు సోమవారంనాడు అమరావతికి వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో శంకర్‌కే టిక్కెట్టును కేటాయించాలని కోరుతూ ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.అయితే శంకర్‌కు టిక్కెట్టు కేటాయించకూడదంటూ ఆయన వ్యతిరేక వర్గీయులు  కూడ అమరావతికి చేరుకొన్నారు.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి  టిక్కెట్టు తనకు రాకుండా వ్యతిరేక వర్గీయులు చేస్తున్న ప్రయత్నాన్ని  అడ్డుకొనేందుకు ఎమ్మెల్యే శంకర్  యాదవ్ ప్రయత్నాలను ప్రారంభించారు. తన వర్గీయులతో అమరావతికి బయలుదేరారు. 12 బస్సుల్లో శంకర్  వర్గీయులు అమరావతికి చేరుకొన్నారు.

ఇదిలా ఉంటే శంకర్‌కు టిక్కెట్టు ఇవ్వకూడదంటూ ఆయన వ్యతిరేక వర్గం కూడ ప్రయత్నాలను  తీవ్రతరం చేసింది. శంకర్ ‌కు వ్యతిరేకంగా తమ బలాన్ని చూపేందుకుగాను వైరివర్గం కూడ అమరావతికి  వెళ్లింది.

తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎవరిది పై చేయిగా మారనుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరోవైపు  తంబళ్లపల్లి నేతలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యే అవకాశం ఉంది.ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్టును ఫైనల్ చేయనున్నారో తేలనుంది.