ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే... ఈ సమావేశాలు సజావుగా సాగకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుని విమర్శించే క్రమంలో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావనను అసెంబ్లీలో తీసుకురావడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే.... మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా... సమావేశాలను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తుండటాన్ని తప్పుపడుతూ ఎమ్మెల్యే రోజా సభలో మాట్లాడారు.  నేటి సమావేశాల్లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లును ప్రవేశపెడితే దానికి టీడీపీ నేతలు అడ్డుపడటం దారుణమని ఆమె అన్నారు.

Also Read రాజధాని ఎక్కడికీ పోదు... సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్...

ప్రతి విషయాన్ని టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై టీడీపీ నేతలు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన ప్రసంగంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా సీమ గురించి ప్రస్తావించలేదని గుర్తు చేశారు. కానీ... ఇప్పుడు మాత్రం ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తనను పొగిడినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్... చంద్రబాబు పై గతంలో చేసిన కామెంట్స్ ని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు.  చంద్రబాబును డర్టీ పొలిటీషియన్‌ అని కేసీఆర్‌ విమర్శించిన సంగతి మరచిపోయారా అని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిషియన్‌ దేశ చరిత్రలోనే లేడని కేసీఆర్‌ అన్న సంగతిని గుర్తు చేశారు. వికేంద్రీకరణ జరగకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని నిలదీశారు. అమరావతి గురించి నానా హంగామా చేస్తున్న చంద్రబాబు ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కూడా ఎందుకు కట్టలేకపోయారని అడిగారు. తండ్రీ, కొడుకులు రాష్ట్రాన్ని దోచుకుని, ఇప్పుడు అమరావతిపై హడావుడి చేస్తున్నారన్నారన రోజా మండిపడ్డారు.