ఆమె కూడా కూత కోస్తూ.. మైదానంలో ఆడటం విశేషం. ఆమె ఆట చూసి స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు. చాలా బాగా ఆడారంటూ ప్రశంసలు కురిపించారు.
నగరి ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆటతో అదరగొట్టారు. ఇప్పటి వరకు ఆమెలోని నటన, రాజకీయంగా ఎలా ఉంటారన్న విషయం అందరికీ తెలుసు. కాగా.. తాజాగా ఆమె తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు.
ఆదివారం నిండ్రలో అంబేడ్కర్ కబడ్డీ టోర్నమెంట్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కబడ్డీ ఆటగాళ్లతో కాసేపు సరదాగా గడిపారు. ఆమె కూడా కూత కోస్తూ.. మైదానంలో ఆడటం విశేషం. ఆమె ఆట చూసి స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు. చాలా బాగా ఆడారంటూ ప్రశంసలు కురిపించారు.
అనంతరం ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్యామ్‌లాల్, మండల కన్వీనర్ వేణురాజు, సర్పంచ్ వసంత బాబురెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేరీ దామోదరం, సింగిల్ విండో అధ్యక్షుడు నాగభూషణంరాజు, స్థానిక నేతలు అనిల్, పరంధామ, దీప పాల్గొన్నారు.
