సీపీఐ నేత నారాయణ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. నగరి నియోజక వర్గానికి తలవంపులు తెస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ ఇంట్లో కుక్కలు కట్టేంత స్థలం కూడా పేద ప్రజలకు ఇవ్వటం లేదని నారాయణ అంటున్నారని మండిపడ్డారు. కమ్యూనిస్టులు ధర్నాలు చేయకుండానే ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని అన్నారు. అసలు నారాయణ నగరికి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. సీ.పీ.ఐ. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అందరికి తెలుసునని.. అయితే దాన్ని చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా నారాయణ చేశారని రోజా విమర్శించారు.

కాగా.. ఇటీవల నారాయణ వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైసీపీ పై కూడా నారాయణ విమర్శల వర్షం కురిపించారు.  వైసీపీ అవినీతి బరుద నుంచి పుట్టిందని, దాన్ని శుభ్రం చేసుకోవాలని హితవు పలికారు. జగన్‌ ఇంట్లో కుక్కలకు కేటాయించినంత స్థలం కూడా పేదలకు ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. విభజన సందర్భంలో ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని వంటి వాటికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇప్పుడు నోరు విప్పకపోవడం బాధాకరమన్నారు. వెంకయ్య పదవీ కాంక్ష వీడి రాష్ట్ర ప్రయోజనాలకోసం నిజాలు మాట్లాడాలని కోరారు.