ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శల వర్షం కురిపించారు. ప్రజలను మోసం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆమె మండిపడ్డారు. 

బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోజా.. టీడీపీ, కాంగ్రెస్ పొత్తును విమర్శించారు. టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పని అయిపోయినట్టేనన్నారు. రాహుల్ గాంధీ.. చంద్రబాబు ఇచ్చిన వీణ వాయించుకుంటూ కూర్చోవాలన్నారు.

తెలుగు పప్పు లోకేష్ కి తోడుగా, రాహుల్ పప్పు వచ్చి చేరారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో తమ అధినేత జగన్ ని గెలవకుండా చేసేందుకు చంద్రబాబు.. పవన్ కాళ్లు పట్టుకున్నారన్నారు. 

ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగితే వెకిలి నవ్వులు, పచ్చి నవ్వులు నవ్వుతున్నారని రోజా మండిపడ్డారు.