వైసీపీ‌లో ఫైర్ బ్రాండ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు న‌గ‌రి ఎమ్మెల్యే రోజా(MLA Roja). అయితే గత కొద్ది రోజులుగా నగరిలో (nagari) చోటుచేసుకన్న పరిణామాలు ఆమెకు ఇబ్బందికరంగా మారాయి. తాజాగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా నగరి వైసీపీలోని గ్రూప్ రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. 

వైసీపీ‌లో ఫైర్ బ్రాండ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు న‌గ‌రి ఎమ్మెల్యే రోజా(MLA Roja). వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచి.. తనదైన దూకుడుతో ముందుకు సాగుతున్నారు. విపక్ష నేతలపై తనదైన శైలిలో మాటల దాడి చేయడంలో కూడా రోజా ముందువరుసలో ఉంటారు. అయితే మంత్రి పదవిపై కూడా ఆమె ఆశలు పెట్టుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా నగరిలో (nagari) చోటుచేసుకన్న పరిణామాలు ఆమెకు ఇబ్బందికరంగా మారాయి. సొంత పార్టీలోనే ఆమె వ్యతిరేక వర్గాలు అన్ని ఒకే గొడుగు కిందకు చేరినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ మాజీ అధ్యక్షుడు కేజే కుమార్ నేతృత్వంలోని వర్గం ఆమెకు వ్యతిరేంకగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. 

వైసీపీలో (YCP) రోజా వ్యతిరేక వర్గంగా ఉన్న నేతలు ఆమెను టార్గెట్‌గా చేసుకుని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా వారి పనులు వారు చేసుకుంటున్నారు. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో రోజాకు నగరి టికెట్ దక్కకుండా చేయాలని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నగరిలో వైసీపీలో ఉన్న గ్రూప్ తగాదాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా నగరిలో వైసీపీ వర్గపోరు మరోమారు రచ్చకెక్కింది. అందుకు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు వేదికగా మారాయి. ఈనెల 21న సీఎం జగన్ జన్మ దిన వేడుకలు సపరేట్‌గా నిర్వహించేందుకు రోజా వ్యతిరేక వర్గం భావిస్తుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల కిందట ఇటు ఎమ్మెల్యే రోజా భర్త ఆర్ కె సెల్వమణి, అసమ్మతి వర్గాలు వేర్వేరుగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించి.. జగన్ బర్త్‌ డే వేడుకలను పోటాపోటీగా నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చాయి.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రోజా వ్యతిరేక వర్గం వైఎస్ జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తాము ఏర్పాటు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేశారంటూ డీఎస్పీ కార్యాలయం వద్ద రోజా వ్యతిరేకవర్గం ఆందోళనకు దిగింది. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పలువురు కార్యాకర్తలను అరెస్ట్ చేవారు. ఏది ఏమైనా నగిరిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రోజాకు ఇబ్బందికరంగా మారాయనే చెప్పాలి.