నగరి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన 108, 104 అంబుల్స్ వాహనాలను మంగళవారం నాడు నగరి ఎమ్మెల్యే రోజా పుత్తూరు పున్నమి సర్కిల్ వద్ద ప్రారంభించారు.

108 వాహనాన్ని రోజా స్వయంగా కొద్ది దూరం నడిపారు. అంబులెన్స్ లో ఉన్న సౌకర్యాలను ఆమె పరిశీలించారు.అంబులెన్స్ కు సెట్ ద్వారా ఆమె మాట్లాడారు. వాహనం ఎలా ఉందో ఆమె పరిశీలించారు. అంబులెన్స్ లో పనిచేసే సిబ్బందితో ఆమె మాట్లాడారు. 

also read:108 డ్రైవర్లు, టెక్నీషీయన్లకు జగన్ గుడ్ న్యూస్: భారీగా పెరిగిన జీతాలు

 రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన 1,008  అంబులెన్స్ లను సీఎం జగన్ విజయవాడలో ప్రారంభించారు.108, 104 వాహనాల్లో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. గతంలో ఉన్న 108 అంబులెన్స్ ల్లో ఉన్న సౌకర్యాల కంటే  మరిన్ని సౌకర్యాలను కల్పించింది ప్రభుత్వం. 

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 108 అంబులెన్స్ ల ను నీరుగార్చినట్టుగా  వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రజల వద్దకు వైద్యం తీసుకెళ్లే ఉద్దేశ్యంతో వైఎస్ఆర్ 108 అంబులెన్స్ లను ప్రవేశపెట్టిన విషయాన్ని ఎమ్మెల్యే రోజా గుర్తు చేశారు.