అమరావతి: 108 అంబులెన్స్ డ్రైవర్లకు, సిబ్బందికి ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. 108 అంబులెన్స్ డ్రైవర్ల జీతాలను సర్వీసును బట్టి పెంచుతున్నట్టుగా ప్రకటించారు.

బుధవారం నాడు రాష్ట్రంలో  108, 104 అంబులెన్స్ లను 1088ని సీఎం జగన్ ప్రారంభించారు.108 అంబులెన్స్ డ్రైవర్ల జీతాలను భారీగా పెంచారు.  సర్వీసుకు అనుగుణంగా డ్రైవర్ల జీతాన్ని రూ.18 నుంచి 20 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 

బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు. 

ఇంతకు ముందుకు డ్రైవర్లకు నెలకు రూ.10వేలు జీతం చెల్లిస్తున్నారు. ఇకపై వారి సర్వీసుకు అనుగుణంగా రూ.18వేల నుంచి 20వేల రూపాయల వరకు అందనుంది. అలాగే ఎమెర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల జీతాలను కూడా పెంచుతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. 
 

also read:ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు: వైఎస్ జగన్

ప్రస్తుతం రూ.12వేల జీతం అందుకుంటున్న మెడికల్‌ టెక్నీయన్‌ ఇకపై రూ.20 వేల నుంచి 30 వేల వరకు అందుతుందని సీఎం జగన్‌ చెప్పారు. పెంచిన జీతాలు ఈ రోజు నుంచే అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు. 

ఇవాళ ప్రారంభించిన 108, 104 అంబులెన్స్ వాహనాలు ఆయా జిల్లాలకు వెళ్లాయి. ప్రతి మండలానికి కొత్తగా 104, 108 వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. గత ప్రభుత్వం 108, 104 అంబులెన్స్ ల గురించి పట్టించుకోలేదని జగన్ విమర్శించారు.