Asianet News TeluguAsianet News Telugu

కోనసీమలో కోడిపందాలపై ఎస్పీ ఉక్కుపాదం.. రాష్ట్రమంతా పర్మిషన్, ఇక్కడేమైంది : ఎమ్మెల్యే రాపాక

కోనసీమ ఎస్పీపై వైసీపీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఫైర్ అయ్యారు. కోడిపందాలపై ఉక్కుపాదం మోపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ సంగతి ప్రభుత్వం చూసుకుంటుందని ..  సంస్కృతి, సంప్రదాయలను కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. 
 

mla rapaka varaprasad fires on konaseema district sp over cock fight
Author
First Published Jan 13, 2023, 3:53 PM IST

రాష్ట్రమంతటా కోడి పందాలు జరుగుతుంటే కోనసీమలో మాత్రం ఎస్పీ ఇబ్బంది పెడుతున్నారు ఆరోపించారు రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ప్రభుత్వం దీనిని చూసుకుంటుందని.. కోడిపందాల నిర్వహణపై మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ప్రజలంతా కోడిపందాలు కోరుకుంటున్నారని చెప్పారు రాపాక. సంక్రాంతికి ప్రజలకు వినోదాన్ని అందించే సంప్రదాయ క్రీడలను జరుగుతాయని ఆయన తేల్చిచెప్పారు ఎమ్మెల్యే. రాష్ట్రమంతటా అనుమతిస్తుంటే కోనసీమలో ఎస్పీ అడ్డుకోవడం ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఎస్పీ సంగతి ప్రభుత్వం చూసుకుంటుందని వరప్రసాద్ ఫైర్ అయ్యారు. సంస్కృతి, సంప్రదాయలను కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. 

ఇదిలావుండగా.. కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తపేట ఆర్డీవో హెచ్చరించారు. ఇటీవల మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఎంపీటీసీ సభ్యులతో ఆయన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కోడిపందాల ముసుగులో జూదం, గుండాట, పేకట, మేళాలు వంటివి జరగకుండా చూడాలని ఆర్డీవో సూచించారు. మండలంలో 144 సెక్షన్ అమల్లో వుంటుందని ఆయన చెప్పారు. 

Also REad: ఏపీలో సంక్రాంతి సందడి... కోడి పందేలకు సై అంటున్న పందెరాయుళ్లు

ఇకపోతే.. ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి సందడి మొదలయ్యింది. ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారం నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడినవారు సొంతూళ్లకు చేరుకుంటుండటంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. ఇక పోలీసుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా కోడిపందేల కోసం నిర్వహకులు ఏర్పాట్లను ముమ్మరం చేసారు. ఇలా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గండిగుంట,పెద్ద ఓగిరాల గ్రామల్లో సంక్రాంతి కోడిపందేల కోసం అంతా రెడీ అయ్యింది. ఈ గ్రామాల్లో ఇప్పటికే పందెం బరులను సిద్దంచేసి పందెంకోళ్లను రెడీగా వుంచారు.  

Follow Us:
Download App:
  • android
  • ios