ఏపీలో ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: లాస్ట్ ఓటేసిన అప్పలనాయుడు


ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  ఎమ్మెల్యే  కోటా  ఎమ్మెల్సీ  ఎన్నికల పోలింగ్ ముగిసింది.  నెల్లిమర్ల  ఎమ్మెల్యే అప్పలనాయుడు  చివరగా  ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి ఓటును సీఎం జగన్  వేశారు.  

MLA Quota MLC Elections Completed after Nellimarla MLA Appalanaidu Cast his Vote lns

అమరావతి:ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  ఎన్నికల పోలింగ్  ముగిసింది.  గురువారం నాడు ఉదయం  9 గంటలకు  పోలింగ్  ప్రారంభమైంది. ఏపీ అసెంబ్లీలోని  175 మంది  ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి ఓటును ఏపీ సీఎం వైఎస్ జగన్ వినియోగించుకున్నారు.

చివరి ఓటును  నెల్లిమర్ల ఎమ్మెల్యే  అప్పల నాయుడు  వేశారు.  తన కుమారుడి వివాహం  సందర్భంగా  నెల్లిమర్ల ఎమ్మెల్యే  అప్పలనాయుడు  ఆలస్యంగా  ఓటింగ్  కు హాజరయ్యారు. అప్పల నాయుడు కోసం  వైసీపీ  నాయకత్వం  ప్రత్యేకంగా విమానాన్ని ఏర్పాటు  చేసింది.  టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి  నెల్లిమర్ల  ఎమ్మెల్యే  అప్పలనాయుడును తీసుకుని వచ్చారు . గన్నవరం  ఎయిర్ పోర్టు నుండి  అసెంబ్లీకి  చేరుకున్న  అప్పలనాయుడు  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

also read:ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: పోలైన 174 ఓట్లు, ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరంటే?

గురువారంనాడు ఉదయం 9 గంటలకు  ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్  ప్రారంభమైంది.   పోలింగ్  ప్రారంభమైన  కొద్దిసేపటికే  ఏపీ సీఎం  వైఎస్ జగన్  ఓటు వేశారు. మధ్యాహ్నానికే  పోలింగ్  పూర్తైంది.  నెల్లిమర్ల ఎమ్మెల్యే  అప్పలనాయుడు  ఓటువేయడంతో  పోలింగ్  పూర్తైంది.  నిర్ణీత సమయం కంటే  పోలింగ్ ముందుగానే  పూర్తైంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios