ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: మార్చి 7న నోటిఫికేషన్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ఈ ఏడాది మార్చి 24న జరగనున్నాయి. ఎమ్మెల్సీ కరీమున్నీసా మరణించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.
అమరావతి: MLA కోటా MLC ఎన్నికలు మార్చి 24న జరగనున్నాయి. అనారోగ్యంతో Karimunnisa మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. గుండెపోటుతో YCP ఎమ్మెల్సీ కరీమున్నీసా గత ఏడాది నవంబర్19 వ తేదీన మరణించింది.
కరీమున్నీసా మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని ఆమె కొడుకును ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నిర్ణయించారు సీఎం YS Jagan కృష్ణా జిల్లాకు చెందిన కరీమున్సీసా Congress పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె వైఎస్ఆర్‌సీపీ లో చేరారు. Vijayawada మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 54వ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. ఈ ఏడాది మార్చి 8న ఆమె శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గుండెపోటుతో కరీమున్నీసా నవంబర్ మాసంలో మరణించారు.
ఈ ఏడాది మార్చి 7వ తేదీన ఎమ్మెల్సీ పోలింగ్ కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 14 నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. మార్చి 15న నామినేషన్ల స్కృూట్నీ, 17న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మార్చి 24న పోలింగ్ నిర్వహించనున్నారు.