హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ బాలకృష్ణ శుక్రవారం నాడు నిరసనకు దిగారు. పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. 


హిందూపురం: hindupur జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే Balakrishna శుక్రవారం నాడు నిరసనకు దిగారు. పొట్టిశ్రీరాములు విగ్రహం నుండి Ambedkar Statueవిగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా బాలకృష్ణ నల్ల కండువాను కప్పుకొన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్షకు దిగనున్నారు. ఆ తర్వాత ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. 

హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్​తో హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు మౌన దీక్ష చేయనున్న నేపథ్యంలో ఇవాళ బాలకృష్ణ నివాసం వద్ద కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలిండియా ఎన్​బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్​ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. 

Andhra Pradesh రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది జనవరి 26న notification జారీ చేసింది. ఈ నెల 26వ తేదీ వరకు కొత్త జిల్లా ఏర్పాటుపై సూచనలు, సలహాలు, అభిప్రాయాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ప్రజల నుండి అందిన సూచనల మేరకు ప్రభుత్వం New Districts పై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

కొత్త జిల్లాల్లో Sri Satyasai District జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే సత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ నెలకొంది. పలు పార్టీలు కూడా ఇదే విషయమై ఆందోళనలు చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఈ విసయమై ఇవాళ స్వయంగా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూనే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారు.పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ కొద్దిసేపు మౌన దీక్షకు దిగారు. ఆ తర్వాత ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.

కొత్త జిల్లాల విషయమై ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు సాగుతున్నాయి. జిల్లా కేంద్రాలతో పాటు పలు డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. తమ ఆందోళనల అంశానికి సంబంధించి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అయితే ఈ వినతులపై ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ తర్వాత ఏం చేయనుందోననేది స్పష్టత రానుంది. 

కొత్తగా ఏర్పాటైన జిల్లాల వివరాలు ఇవే.. 
జిల్లా పేరు జిల్లా కేంద్రం
శ్రీకాకుళం శ్రీకాకుళం
విజయనగరం విజయనగరం
మన్యం జిల్లా పార్వతీపురం
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు
విశాఖపట్నం విశాఖపట్నం
అనకాపల్లి అనకాపల్లి 
తూర్పుగోదావరి కాకినాడ
కోనసీమ అమలాపురం
రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం
నరసాపురం భీమవరం
పశ్చిమగోదావరి ఏలూరు
కృష్ణా మచిలీపట్నం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
గుంటూరు గుంటూరు
బాపట్ల బాపట్ల
పల్నాడు నరసరావుపేట
ప్రకాశం ఒంగోలు
ఎస్ పీఎస్ నెల్లూరు నెల్లూరు
కర్నులు కర్నూలు
నంద్యాల నంద్యాల
అనంతపురం అనంతపురం
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి
వెఎస్సార్ కడప కడప
అన్నమయ్య జిల్లా రాయచోటి
చిత్తూరు చిత్తూరు
శ్రీబాలాజీ జిల్లా తిరుపతి